తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు.. పూర్తి వివరాలు ఇవే

-

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరగనున్నాయి. భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్వర్వుల ప్రకారం… ఎల్లుండి నుంచి భూముల కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు స్పష్టం కనిపిస్తుంది.

తెలంగాణలో ఇప్పటి వరకు అమలులో ఉన్న 6 శాత్ రిజిస్ట్రేషన్‌ ఫీజును 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ట మార్కెట్‌ విలువ ఎకరాకు రూ. 75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. స్లాబుల వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలను పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధర రూ. 100 నుంచి రూ. 200 లకు పెంచిన సర్కార్‌.. స్లాబులు వారీగా 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో ఓపెన్‌ ప్లాట్ల మార్కెట్‌ విలువలను పెంచినట్లు స్పష్టం చేసింది. అలాగే అపార్ట్‌ మెంట్ల ప్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ. 800 నుంచి రూ. 1000 కి పెంచిన సర్కార్‌.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ సవరించిన మార్కెట్‌ విలువుల, స్టాంప్‌ డ్యూటీ రేట్లు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి.

పెరిగిన ధరలు ఇవే…

భూములు, ఇళ్లు, ప్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4 శాతం ఉండగా.. ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6 శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఇకపై పెరగనున్నవి.

భూముల విలువ
రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు
విక్రయ అగ్రిమెంట్‌ లేదా జీపీఏ
డెవలప్‌ మెంట్‌ అగ్రిమెంట్‌
జీపీఏ
డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌
కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు
కుటుంబ మరియు కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు
బహుమతి
టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌
జీపీఏ
వీలునామా
లీజు సహా ఇతర సేవల ఛార్జీలు

Read more RELATED
Recommended to you

Latest news