సంక్రాంతి ఎఫెక్ట్…ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింఇ. సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ లో కోచ్ లను పెంచారు. రేపటి నుంచీ సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో కోచ్ లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై 3 ఎగ్జిక్యూటివ్ కోచ్ లు, 17 చైర్ కార్ లు ఉంటాయి. వందేభారత్ కు పెరుగుతున్న డిమాండ్, సంక్రాంతి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక అటు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి, విశాఖపట్నం మధ్య జనసాధరణ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.
1) రైలు నెం: 08534 చర్లపల్లి – విశాఖపట్నం (జనసాధరణ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు)
చర్లపల్లి నుండి 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి, 11, 13, 20, 18, 20 తేదీల్లో 14.20 గంటలకు (అదే రోజున) విశాఖపట్నం చేరుకుంటుంది.
2) రైలు నం: 08533 విశాఖపట్నం – చర్లపల్లి (జనసాధరణ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు)
10, 12, 15 & 17 జనవరి, 2025 తేదీలలో విశాఖపట్నం నుండి 09.45కి బయలుదేరి 22.30 గంటలకు (అదే రోజున) చేరుకుంటుంది.