కరోనా నేపథ్యంలో చాలా మంది ప్రజలు స్థిరాస్తి కొనుగోలుపై ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. అద్దె కొంపల్లో ఉండటం కన్నా తమకంటూ సొంతంగా ఇళ్లు ఉండాలని భావిస్తున్నారు. ఈ మేరకు చాలా మంది ప్రజలు లాక్ డౌన్ కాలంలో స్థిరాస్తులు కొనుగోలు చేశారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులు సైతం కార్లు కొనుగోలు చేసుకుంటున్నారు. ఎక్కడ ఏ చోట వైరస్ ఉందనే భయంతో జాగ్రత్త పడుతున్నారు.
హైదరాబాద్ అవుటర్ కేంద్రంగా పటాన్ చెరు-సంగారెడ్డి, శంకర్ పల్లి, శ్రీశైలం రహదారి, ఘట్ కేసర్, బెంగళూరు, మేడ్చల్, శామీర్ పేట రహదారుల్లో విల్లాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. ప్రాంతం, విస్తీర్ణం, ల్యాండ్ కాస్ట్ ని బట్టి ఒక్కో విల్లా రూ.1.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు పలుకుతున్నాయి. సగటు విల్లా ధర రూ.2.5 కోట్లు ఉంటుందని రియల్ ఏస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంకే మొగ్గు చూపుతున్నారు. సూళ్లు కూడా తెరవకపోవడంతో విద్యార్థులు సైతం ఆన్ లైన్ లోనే పాఠాలను వింటూ కుటుంబసభ్యులతో గడిపేస్తున్నారు. అయితే కుటుంబం పెద్దగా ఉన్న వారికి చిన్న ఇళ్లు సరిపోకపోవడంతో పెద్దగా ఉండే ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మూడు, నాలుగు పడక గదుల కోసం వెతుకుతున్నారు. విశాలమైన ఇళ్లు బడ్జెట్ లో దొరకాలంటే శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పదు. సొంతంగా ఇళ్లు కట్టుకోవాలంటే తక్కువ బడ్జెట్ లో దొరికే ప్రాంతాల్లో భద్రత సమస్య చాలా తక్కువ. కానీ విల్లాలో భద్రతకు ఢోకా ఉండదు. నీరు, విద్యుత్, ఇంటర్ నెట్ వంటి ఎలాంటి సమస్యలు ఉండదు. దీంతో పాటు ప్రకృతి ప్రేమికులకు నచ్చే విధంగా విల్లా ఏర్పాటు స్థలంలో మొక్కలను నాటుతారు. కొనుగోలుదారుల టేస్ట్ కి తగ్గట్లు విల్లాలను రూపొందిస్తుంటారు విల్లా ప్రాజెక్ట్ బిల్డర్లు.