అమెరికాలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య తీవ్రమవుతుండటంతో ఆందోళన వ్యక్తమైంది. న్యూయార్క్ నగరం వైరస్ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నది.వచ్చే శీతాకాలంలో కొవిడ్-19 విజృంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. కొవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు న్యూయార్క్ నగరంలో ఇంకా నమోదు కాలేదని, కానీ, ఓమిక్రాన్ కేసులు నమోదుకాక తప్పదని న్యూయార్క్ గవర్నర్ హెచ్చరించారు.
కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రమాదకరమైనదని, డెల్టా వేరియంట్ కంటే తీవ్రమైనదనే హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. అన్ని దేశాలు ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాయి. ఎక్కడికక్కడ హెల్త్ ఎమర్జెన్సీలు ప్రకటిస్తున్నాయి.