ఉద్యోగుల్లో పెరుగుతున్న టెక్‌ నెక్‌ సిండ్రోమ్‌.. లైట్‌ తీసుకోవద్దు బాస్‌..!

-

టెక్ నెక్ అనేది మెడ నొప్పికి ఆధునికంగా పెట్టిన పేరు. ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారికి ఈతరహా టెక్ నెక్ పెయిన్ వస్తుంది. ఇది అందరికీ వస్తుంది. ఎక్కువగా చదవడం లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్ వైపు చూడటం వల్ల వెన్నెముక పదేపదే ఒత్తిడికి గురవడం వల్ల కూడా వస్తుంది.

కారణం ఏంటి..?

కంప్యూటర్‌ ముందు కూర్చుని పని చేస్తున్నప్పుడు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తల బరువుకు మెడ వెనుక కండరాలు కుదించుకుబడతాయి. క్రిందికి చూస్తే తలకున్న కండరాలు చురుకుగా పనిచేస్తాయి. దీనివల్ల కండరాలు ఒత్తిడికి గురై.. నొప్పి కలుగుతుంది.. దీనినే ఇటీవలి కాలంలో టెక్ నెక్ అని పిలుస్తున్నారు.

ఈ టెక్ నెక్ సిండ్రోమ్ కారణంగా తలనొప్పి, మెడ, భుజాల పైభాగంలో నొప్పి, చేతుల్లో జలదరింపు, నొప్పి, తిమ్మిరి, వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెన్నెముక సహజ వక్రతను కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం ఫోన్‌లో, కంప్యూటర్‌లో గడిపే సమయం కారణంగానే ఈతరహా మెడ నొప్పి వస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.

జాగ్రత్తలు పాటించటం ద్వారా ;

కంప్యూటర్ వద్ద పనిచేసే సరైన పొజిషన్‌లో కుర్చోవడం చాలా ముఖ్యం. మనకు ఇష్టం వచ్చినట్లు కుర్చుంటే..నడుము నొప్పి వస్తుంది. వెన్నుపూసను కుర్చీకు ఆనించాలు. నిటారుగా కుర్చోవాలి. చాలామంది తమకు తెలియకుండానే ముందుకు వంగిపోతుంటారు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవటం మంచిది. దీని వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండటంతోపాటు మెడ సరైన స్ధితిలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. కంప్యూటర్‌ మానిటర్‌, సెల్ ఫోన్‌ను కంటికి సమాన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ ముందు గడిపే సమయాన్ని పరిమితం చేయటం ద్వారా సమస్య రాకుండా చూసుకోవచ్చు.

వ్యాయామం చేయడం కొద్దిపాటి నొప్పికి ఆయింట్‌మెంట్ వాడటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. గంటలతరబడి అలా కదలకుండా మాత్రం ఛైర్‌లో కుర్చోవద్దు. ఇలా చేస్తే నడుమునొప్పి మాత్రమే కాదు..రక్తప్రసరణ జరగ్గా ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version