IND vs WI : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జ‌ట్లు ఇవే

-

వెస్టిండీస్ తో టీమిండియాతో జ‌రుగుతున్న టీ 20 సిరీస్ లో భాగంగా.. నేడు రెండో టీ 20 జ‌రుగుతుంది. ఈ టీ 20 మ్యాచ్ కోల్‌క‌త్త‌లోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వ‌హిస్తున్నారు. కాగ ఇప్ప‌టికే జ‌రిగిన వ‌న్డే సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు జ‌రుగుతున్న టీ 20 సిరీస్ లో జ‌రిగిన మొద‌టి టీ 20 మ్యాచ్ లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. నేటి రెండో టీ 20 మ్యాచ్ ను గెలిచి ఈ సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాన‌లి టీమిండియా ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేస్తుంది. ఆటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో రాణిస్తు.. వ‌రుస విజ‌యాల‌ను న‌మోదు చేస్తుంది.

భారత తుది జ‌ట్టు : రోహిత్ శర్మ( కెప్టెన్ ), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్( వికెట్ కీప‌ర్ ), సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్

వెస్టిండీస్ తుది జ‌ట్టు : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్( వికెట్ కీప‌ర్ ), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్( కెప్టెన్ ), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, షెల్డన్ కాట్రెల్

Read more RELATED
Recommended to you

Exit mobile version