బంగ్లా తో వన్ డే సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ మహిళలు ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి బంగ్లా మహిళలను చిత్తు చిత్తు గా ఓడించారు. మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ మహిళలలో రోడ్రిగస్ (86) మరియు కెప్టెన్ హర్మన్ (52) లు రాణించారు. అనంతరం 229 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన బంగ్లాకు అడుగడుగునా కష్టాలే అని చెప్పాలి. భారత్ బౌలర్లు ఏ క్షణంలోనూ వీరిని కుదురుకోనివ్వకుండా కట్టడి చేసి 120 పరుగులకు ఆల్ అవుట్ చేసి 108 పరుగుల తేడాతో ఓడించి వన్ డే సిరీస్ లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. కాగా మొదటి వన్ డే లో అనూహ్యంగా ఇండియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడంతో సిరీస్ లో నిలవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలవాలి.