జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి రోజా. టిడిపి అధినేత నారా చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో దళారీగా మారారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ దళపతి కాదు.. దళారీ అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామ్య సమావేశానికి వెళ్ళింది చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో టిడిపి తో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు.
మెగా అభిమానులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటే.. ఆయన మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. ఇందువల్ల పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు, కాపులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికలలో మూడు పార్టీలతో కలిసి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక పవన్ మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ మీడియా ముందు హీరో.. రాజకీయాలలో జీరో అని ఎద్దేవా చేశారు.