తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కానీ.. మరో రెండు రోజుల్లో వీహెచ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, గీతా రెడ్డి, శ్రీధర్ రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులను తన రాజీనామా గురించి వాళ్లును ఒప్పిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటానని తెల్చి చెప్పారు. కానీ తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. ఇక తాను ఇండిపెండెంట్ రాజకీయ జీవితాన్ని గడుపుతానని అన్నారు. కాంగ్రెస్ కి దూరంగా ఉన్నా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు విధేయుడిగానే ఉంటానని తెలిపారు.
కాగ తనపై కోవర్టు అనే ముద్ర.. కాంగ్రెస్ పార్టీ నాయకలు వేస్తున్నారని అన్నారు. కోవర్టు అనే నింద కాస్త బాధగా ఉందని అన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగ ప్రత పక్ష పార్టీ ఎమ్మెల్యే.. మంత్రి కలవడం నేరమా అని ప్రశ్నించారు. తన నియోజక వర్గం అభివృద్ధి కోసం మంత్రిని కలిస్తే.. కోవర్టు అనే ముద్ర వేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. కోవర్డు అనే నిందను దూరం చేసుకోవడానికి కాంగ్రెస్ తో సంబంధం తెంచుకుంటున్నాని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీ దేశంలో లేదని అన్నారు.