లార్డ్స్ వేదికగా ఇండియా మరియు ఇంగ్లాండు జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా…. మొదటి టెస్ట్ మ్యాచ్ కంటే బాగానే రాణించింది. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది టీమిండియా. రెండో రోజు 126 ఓవర్ల వద్ద 364 పరుగులు చేసి టీమిండియా… ఆల్ అవుట్ అయింది.
ఇక ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే…. వికెట్ కీపర్ కె. ఎల్. రాహుల్ 129 పరుగులు మరియు ఓపెనర్ రోహిత్ శర్మ 83 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 42 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు తీసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. అలాగే రాబిన్సన్ రెండు వికెట్లు,మార్క్ వుడ్ రెండు వికెట్లు, మోయిన్ ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది.