రిజర్వేషన్లను దోచుకున్నది ఇండియా కూటమి : అమిత్ షా

-

నిన్న రాయ్‌బరేలీ స్థానానికి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీ ఈసారి పోటీ చేయటం లేదు. దీంతో ఈసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దింపింది.అయితే, దీనిపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.ఈ రోజు గుజరాత్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి భారీ మెజారిటీతో ఓడిపోతారని అన్నారు. దళితులు, గిరిజనులు, వెనకబడిన వారి కోసం నిర్దేశించిన రిజర్వేషన్లను ప్రతిపక్ష ఇండియా కూటమి దోచుకుంటోందని అమిత్ షా విమర్శించారు.

ప్రధాని మోడీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాహుల్ బాబా అండ్ కంపెనీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.ప్రధాని మోడీకి 2014, 2019లో పూర్తి మెజారిటీ ఉంది, కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎప్పుడూ టచ్ చేయలేదని తెలిపారు.ఇది బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేదని, ఎవరూ కూడామ రిజర్వేషన్లను తాకరని అమిత్ షా అన్నారు. రిజర్వేషన్లను దోచుకున్నది ఇండియా కూటమి అని అమిత్ షా ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news