తెలంగాణలో తమకు అనుకూల వాతావరణం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు నటిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నామని ప్రజలను కాంగ్రెస్ నేతలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గెలిస్తే, అధికారం వస్తేనే చేస్తాం అని అంటున్నారు తప్ప వచ్చేది మేమే కచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 420 హామీలు అన్ని ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.