ప్రపంచ చెస్ ఒలంపియాడ్ లో భారత్ కు స్వర్ణం వచ్చింది. రష్యాతో జరిగిన ఆన్లైన్ పోరులో రష్యా భారత్ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. భారత్ తరుపున కోనేరు హంపీ ఈ పోటీలో పాల్గొన్నారు. ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా బంగారు పతకాలు సాధించాయని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రకటన చేసింది. 2014 లో ఒలింపియాడ్‌లో కాంస్య పతకం సాధించిన భారత్‌కు ఇప్పుడు తొలిసారిగా బంగారు పతకం వచ్చింది.
శనివారం పోలాండ్‌తో జరిగిన చెస్ ఒలింపియాడ్ సెమీఫైనల్లో భారత్ విజయం సాధించింది. కోనేరు హంపీ విజయం బంగారు పతకం సాధించడంపై పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ప్రసంశలు అందిస్తున్నారు. సీనియర్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ సహా పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కోనేరు హంపీని అభినందిస్తున్నారు. ఆమె ప్రతిభకు ఇది ఒక మైలురాయి అంటూ ట్వీట్ లు చేస్తున్నారు.
We are the champions !! Congrats Russia!
— Viswanathan Anand (@vishy64theking) August 30, 2020