కరోనా నేపథ్యంలో మార్చి చివరి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా బార్లు, పబ్‌లు, క్లబ్‌లు మూసి ఉన్న సంగతి తెలిసిందే. మే నెలలో ఆంక్షలను సడలించినా కేవలం మద్యం షాపులను మాత్రమే అనుమతించారు. దీంతో బార్లు, పబ్బుల యజమానులు తమ స్టాక్‌ను మద్యం షాపులకు తరలించి సరుకు క్లియర్ చేశారు. అయితే సెప్టెంబర్ 1 నుంచి అమలు కానున్న అన్‌లాక్ 4.0 నేపథ్యంలో ఆంక్షలను సడలించారు. దీంతో కర్ణాటకలో ఆ రోజు నుంచి బార్లు, పబ్బులు, క్లబ్బులు ఓపెన్ కానున్నాయి.
కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్ నగేష్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి అక్కడ బార్లు, పబ్బులు, రెస్టారెంట్లను ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను పూర్తి మార్గదర్శకాలను సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం సూచించిన అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు తమ రాష్ట్రంలోనూ అమలవుతాయని తెలిపారు.
కాగా కరోనా నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలన్నీ ఆదాయాన్ని కోల్పోయాయి. మద్యం ద్వారా రాష్ట్రాలకు గతేడాది ఇదే సమయంలో భారీగా ఆదాయం వచ్చింది. కానీ మద్యం షాపులు మూసి ఉండడం, తెరిచిన తరువాత రేట్లను పెంచడం తదితర కారణాల వల్ల ఈ సారి ఈ సమయంలో రాష్ట్రాలకు ఎక్సైజ్ ఆదాయం పడిపోయింది. ఈ క్రమంలో బార్లు, పబ్బులను ఓపెన్ చేస్తే కొంత వరకు ఆదాయం పెరుగుతుంది. అయితే ఆయా ప్రదేశాల్లో 50 శాతం కెపాసిటీతోనే మద్యం సరఫరా చేయాలి. కోవిడ్ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.