ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. అర్థరాత్రి 1.44 గంటలకు మిస్సైళ్లతో దాడి ప్రారంభం ఐంది. సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.

9 స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో… పాకిస్తాన్ చుక్కలు చూస్తోంది. ఇప్పటివరకు జరిగిన దాడులలో మొత్తం 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు సమాచారం అందుతుంది.