చైనాకు ఇండియా షాక్… మరో 43 యాప్స్ బ్యాన్

-

ఐటి చట్టం కింద బ్లాక్ చేసే యాప్‌ల జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ యాప్స్ భద్రతకు పెను ముప్పు అని కేంద్రం పేర్కొంది. వీటిలో 43 చైనా యాప్స్ ఉన్నాయి అని కేంద్రం వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 43 మొబైల్ యాప్‌ లను బ్యాన్ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ఎ కింద ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రత, భారతదేశం యొక్క రక్షణ, రాష్ట్ర భద్రత వంటి అంశాల్లో వాటి కార్యక్రమాలకు సంబంధించి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

china apps ban

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమగ్ర నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 29, 2020 న ప్రభుత్వం 59 మొబైల్ యాప్స్ ని బ్యాన్ చేసింది. సెప్టెంబర్ 2 న 118 యాప్స్ ని బ్యాన్ చేసింది. నేడు మరో 43 చైనా యాప్స్ ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అలీసప్లియర్స్ మొబైల్ యాప్
అలీబాబా వర్క్‌బెంచ్ అలీ ఎక్స్‌ప్రెస్
– స్మార్ట్ షాపింగ్, బెటర్ లివింగ్
అలిపే క్యాషియర్
లాలామోవ్ ఇండియా – లాలామోవ్ ఇండియాతో డెలివరీ యాప్
డ్రైవ్
స్నాక్ వీడియో క్యామ్‌కార్డ్
– బిజినెస్ కార్డ్ రీడర్
కామ్‌కార్డ్
బిసిఆర్ (వెస్ట్రన్) సోల్
చైనీస్ సోషల్ – ఉచిత ఆన్‌లైన్ డేటింగ్ వీడియో యాప్ & చాట్
డేట్ ఆసియా – డేటింగ్ & ఆసియా సింగిల్స్ ఫర్ చాట్
వే డేట్ –డేటింగ్ యాప్
ఫ్రీ డేటింగ్ యాప్
అదోర్ యాప్
ట్రూలీ చైనీస్… ఇలా మరికొన్ని యాప్స్ ని ఇండియా బ్యాన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version