BREAING : రెండో టెస్ట్ లోనూ ఆసీస్ చిత్తు..టీమిండియా గ్రాండ్ విక్టరీ

-

ఢిల్లీలో ఆస్ట్రేలియా తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 115 పరుగుల టార్గెట్ ను టీమిండియా అవలీలగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై 4 వికెట్లు కోల్పోయి… విజయం సాధించింది టీమిండియా.

ఇక టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 31 పరుగులు, పూజార 31 పరుగులు, కే ఎస్ భరత్ 23 పరుగులు, కింగ్ కోహ్లీ 20 పరుగులు మరియు శ్రేయస్ అయ్యర్‌ 12 పరుగులు చేశారు. దీంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0 లీడ్‌ సాధించింది. కాగా మార్చి 1వ తేదీన ఇండోర్ లో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

కాగా, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తీరు మారడం లేదు. తాజాగా ఆసీస్ తో రెండో ఇన్నింగ్స్ లో మరోసారి నిరాశపరిచాడు. స్వల్ప లక్ష్యంతో రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రాహుల్, కేవలం ఒక్క పరుగుకే లియాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో రాహుల్ పై ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘ఇంకా ఎన్ని ఛాన్స్ లు, మారావా? నువ్వు IND మ్యాచ్ ల్లో ఆడవు, IPL లో అయితే పరుగుల వరద పారిస్తావు’ అని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version