భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మధ్యలో కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఇప్పుడు నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73 లక్షల 70 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 63,371 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 895 మంది మృతి చెందారు.
అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 81,541గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73,70,469కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 8,04,528 ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,53,780కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,12,161కి చేరింది. ఇక దేశంలో నిన్న 10,28,622 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 9,22,54,927 పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.