ప్రపంచంలో ఓ వైపు కరోనాతో గజగజలాడుతోంది. ముఖ్యంగా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ రూపం మరో ప్రమాదం ముంచుకొస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు యూరప్ దేశాల్లో ఇటీవల కాలంగా కరోనా తీవ్రత పెరిగింది. జర్మనీ, బ్రిటన్, ప్రాన్స్, రష్యా వంటి దేశాల్లో రోజుకు సగటున 30 వేల కన్నా అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి ఇండియాలో తగ్గుముఖం పడుతుంది. గత కొన్ని రోజుల నుంచి 15 వేల కన్నా తక్కువగానే రోజూ వారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో 8,318 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 465 మంది మరణించారు. మరోవైపు రికవరీ రేటు కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,967 కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. ఇండియాలో మొత్తం కేసుల వివరాలు పరిశీలిస్తే ….
మొత్తం కేసులు- 3,44,56,730
మరణాలు- 4,67,933
రికవరీ- 3,39,88,797
యాక్టివ్ కేసులు – 1,07,019
దేశంలో ఇప్పటి వరకు ఇచ్చిన డోసులు సంఖ్య – 121.06 కోట్లు