ఇండియా లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు తగ్గు ముఖం పడుతున్నాయి. గతంతో పోల్చితే.. ఈ మధ్య కాలంలో విపరీతంగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,302 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,99,925 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,24,868 కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం 531 రోజుల అనంతరం ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 267 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,65,349 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,39,09,708 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,15,79,69,274 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 51,59,931 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
COVID-19 | India reports 10,302 new cases, 11,787 recoveries & 267 deaths in the last 24 hours, as per Union Health Ministry.
Active caseload stands at 1,24,868- lowest in 531 days (account for less than 1% of total cases, currently at 0.36%; Lowest since March 2020) pic.twitter.com/g9kvkwZUWT
— ANI (@ANI) November 20, 2021