18ఏళ్లు నిండిన వారంద‌రికీ బూస్ట‌ర్ డోస్..!

-

18ఏళ్లు నిండిన వారంద‌రికీ బూస్ట‌ర్ డోస్..!
క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో అమెరికా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 18ఏళ్లు నిండిన వారంద‌రికీ బూస్ట‌ర్ డోసులు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఫైజ‌ర్. మెడార్నా వ్యాక్సిన్ ల‌కు అమెరికా ఔష‌ధ సంస్థ అనుమ‌తులు ఇచ్చింది. ఇప్ప‌టికే అమెరికాలో 65ఏళ్ల పైబ‌డిన వారికి బూస్ట‌ర్ డోసును ఇచ్చారు. చ‌లికాలంలో క‌రోనా తీవ్ర‌వ ఎక్కు అయ్యే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో నిపుణుల సూచ‌న‌ల మేర‌కు అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఇదిలా ఉంటే రెండో డోసు తీసుకున్న త‌ర‌వాత ఆరు నెల‌ల‌కు బూస్ట‌ర్ డోస్ ను తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అదే విధంగా సింగిల్ డోస్ టీకా జాన్స‌న్ అండ్ జాన్స‌న్ తీసుకున్న‌వాళ్లు కూడా బూస్ట‌ర్ డోస్ తీసుకోచ్చ‌ని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కూ 19.5 కోట్ల మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. మూడు కోట్ల మంది ప్ర‌జ‌లు మూడో డోసు వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version