NCERT కీలక నిర్ణయం.. పాఠ్య పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్

-

ఇండియా పేరును భారత్ గా మార్చుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరుకు మరోపేరుగా భారత్ ను అభివర్ణిస్తూ ఇలా అన్ని చోట్ల వాడుతుంది. దీంతో ఇప్పుడు జాతీయ స్థాయి సంస్థలు కూడా తమ వాడుకలో ఇండియా పేరు స్థానంలో భారత్ గా పేరు మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైస్కూల్, ఉన్నత విద్యాస్థాయిలో పుస్తకాలు ముద్రిస్తున్న NCERT కూడా అదే బాట పట్టింది.

ఇండియా స్థానంలో పాఠ్యపుస్తకాల్లో భారత్ పేరు వాడేవిధంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్యానెల్ చేసిన ప్రతిపాదనను దాని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై ముద్రించే పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ పేరు కనిపించనుది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ముద్రించే పుస్తకాల్లో తాజా మార్పును అమలు చేసే దిశగా NCERTఅడుగులు వేస్తోంది. జీ-20 సదస్సుతో పాటు ఆసియన్ సదస్సు పలు సందర్భాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ పేరుతో అతిథులకు ఆహ్వానాలు పంపింది కేంద్ర ప్రభుత్వం. అప్పటికే పలు చోట్ల ఇండియా పేరుకు బదులు భారత్ అని వాడుకలో ఉండటంతో ప్రభుత్వం చేసిన మార్పును పెద్దగా పట్టించుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version