నెదర్లాండ్ బౌలర్ బస్ డి లీడ్ జట్టులో ఎంత కీలకమైన ప్లేయర్ అన్నది తెలిసిందే. ఇంతకు ముందు చాలా మ్యాచ్ లను గెలిపించిన ఘనత డి లీడ్ కు ఉంది.. కానీ ఈ రోజు ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో తాను జట్టు కోసం చేసిందంతా మరిచిపోయేలా చేశాడు హార్డ్ హిట్టర్ మాక్స్ వెల్. వన్ డే వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఇంత చెత్తగా బౌలింగ్ చేసి ఉండడు. ఈ రోజు డి లీడ్ ప్రదర్శన అంత దారుణంగా ఉంది.. ఇతను తన కోట ప్రకారం 10 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకోవడంతో పాటు 115 పరుగులు ఇచ్చాడు. ఇంతకు ముందు వరకు వన్ డే లలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా ఈ రికార్డ్ మైక్ లూయిస్ పేరు మీద ఉంది.. ఇతను వన్ డే లో 113 పరుగులు ఇచ్చాడు.
కానీ డి లీడ్ మాత్రం అతనికన్నా రెండు పరుగులు ఎక్కువగానే ఇచ్చి 115 పరుగులతో టాప్ లో చెత్త బౌలర్ గా నిలిచాడు. కనీసం బ్యాటింగ్ లో అయినా డి లీడ్ రాణించి జట్టుకు అతి పెద్ద ఓటమిని తప్పిస్తాడా చూడాలి.