కరోనా రోగుల చికిత్స కోసం మూడు భారతీయ కంపెనీలు నేపాల్ కు ప్రజల ప్రాణాలను రక్షించే యాంటీ-వైరల్ రెమ్‌డెసివిర్‌ను సరఫరా చేయడం ప్రారంభించాయి. డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం డైరెక్టర్ జనరల్ నారాయణ ప్రసాద్ ధకల్ దీనిపై ప్రకటన చేసారు. “రెమ్‌డెసివిర్ సరఫరా కోసం మూడు సంస్థలు అంగీకరించాయి అని పేర్కొన్నారు. మైలాన్, సిప్లా మరియు హెటెరో డ్రగ్స్ తమ డిమాండ్ ప్రకారం మందులను సరఫరా చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కంపెనీలు మాత్రమే సరఫరా చేసే యాంటీ-వైరల్ వాడకాన్ని తాము అనుమతిస్తామన్నారు. “వాటిలో, మైలాన్ నేపాల్ కు యాంటీ-వైరల్ డ్రగ్ ని సరఫరా చేయడం ప్రారంభించిందని చెప్పారు. మొదట, 570 బాటిల్స్ ని ఆర్డర్ చేసినట్టు పేర్కొన్నారు. భారతీయ కంపెనీలు వాటిని తయారు చేయడం చాలా సులభం అని, ఖర్చు కూడా తక్కువగా అవుతుంది కాబట్టి నేపాల్ వాటిని ధృవీకరించింది అని పేర్కొన్నారు.