పాకిస్తాన్, భారత్‌కు మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్న తరుణంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలో భద్రతా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు పరిస్థితులను అంచనా వేసేందుకు శుక్రవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన CDSతో పాటు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లలో ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి రప్పించాలని నిర్ణయించారు.కాగా, టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సేవలను అందించే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన మిలిటరీ రిజర్వ్ ఫోర్స్. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉండనున్నారు.