నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ప్రజా ప్రతినిధుల విరాళం

-

పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాల పై సైనిక దాడి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

దేశం క్షేమం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల వేతనాన్ని ఇస్తే వాళ్లకు కూడా మంచి పేరు వస్తుందని.. పలువురు పేర్కొంటున్నారు. కేవలం ఒక్క నెల కాదు.. రెండు, మూడు నెలలు ఇచ్చినా నష్టం లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఎవరైనా దాతలు కూడా ముందుకు వచ్చి భారతదేశ సైనికులకు సహకరిస్తే బాగుంటుందని కొంత మంది నిపుణులు పేర్కొంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news