కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు చైనాకు భారత్‌ సహాయం..!

-

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను అడ్డుకునేందుకు చైనాకు భారత్‌ సహాయం అందించనుంది. ఈ మేరకు భారత్‌ చైనాకు మెడికల్‌ సప్లయిస్‌ను పంపించనుంది. చైనాలోని ఇండియన్‌ ఎంబస్సీ అధికారి విక్రమ్‌ మిస్రీ ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు గాను చైనాకు కావల్సిన అన్ని సహాయ సహకారాలను భారత్‌ అందిస్తుందని ఆయన తెలిపారు.

కాగా మంగళవారం వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావంతో 2వేల మంది వరకు మృతి చెందగా, ఒక్క చైనాలోనే 1886 మంది చనిపోయారు. ఇక చైనాలో ఇప్పటికే మరో 75వేల మందికి కరోనా వైరస్‌ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా మరో 1000 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు తేలింది. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హెల్త్‌ ఎమర్జెన్సీ నెలకొంది.

ఇక కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు గాను చైనాకు భారత్‌ అతి త్వరలో మెడికల్‌ సప్లయిస్‌ను పంపిస్తుందని మరోవైపు విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు కూడా చేశారు. చైనాకు భారత్‌ అందించే సహాయం వల్ల ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మిస్రీ చేసిన ట్వీట్లను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా రీట్వీట్‌ చేయడం విశేషం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version