తొలిసారి ఫైనల్ లో బంగ్లాదేశ్, టీం ఇండియా బ్యాటింగ్…!

-

అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ కి అడుగుపెట్టిన యువ టీం ఇండియా బంగ్లాదేశ్ తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కి అనుకూలం కాదు. అలా అని బౌలింగ్ కి కూడా పిచ్ అనుకూలంగా లేదు. దీనితో అసలు ఎంత స్కోర్ సాధిస్తారు అనే అంచనా కూడా లేదు. లీగ్ మ్యాచ్ లలో దాదాపు అన్నింటిలో యువ టీం ఇండియా సత్తా చాటింది.

దీనితో ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా యువ టీం ఇండియా ఉంది. ద్రావిడ్ శిక్షణలో కుర్రాళ్ళు ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీ మీద కన్నేశారు. అటు తొలిసారి ఫైనల్ కి వెళ్ళిన బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక భారత బ్యాటింగ్ విషయానికి వస్తే సక్సేనా, జైస్వాల్ తో అత్యంత పటిష్టంగా ఉంది. దీనితో ఏ మేరకు రాణిస్తారు అనేది చూడాలి.

భారత జట్టు : ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, దివ్యాంశ్‌, తిలక్‌ వర్మ, ధ్రువ్‌ జురెల్‌, సిద్దేశ్‌ వీర్‌, అథర్వ, రవి బిష్ణోయ్‌, శస్వాత్‌, కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌

బంగ్లాదేశ్‌ జట్టు : అక్బర్‌ అలీ (కెప్టెన్‌), పర్వేజ్‌, తన్‌జీద్‌, మహ్మదుల్‌ హసన్‌, తౌహిద్‌, షహాదత్‌, అవిషేక్‌ దాస్, షమీమ్‌, రకీబుల్‌, షోరిఫుల్‌ ఇస్లామ్‌, హసన్‌ షకిబ్

Read more RELATED
Recommended to you

Exit mobile version