భారత్‌ తో ఢీకి సై అంటున్న చైనా ?

-

భారత అంతరిక్ష పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మన మన ఉపగ్రహాలే కాక విదేశాల ఉపగ్రహాలు కూడా పంపుతున్నాం. ఈ మేరకు అంతరిక్ష వాణిజ్యంలోనూ అడుగు పెట్టాం.. మిగిలిన రంగాల మాట ఎలా ఉన్నా అంతరిక్ష వాణిజ్యంలో ఇండియాదే చైనా కంటే పైచేయి.

అందుకే ఈ రంగంలో ఇండియాను ఢీకొట్టేందుకు చైనా ప్రయత్నిస్తోంది. తాజాగా 1.5 టన్నుల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లే కమర్షియల్ రాకెట్లను చైనా ఆవిష్కరించింది. ‘లాంగ్‌ మార్చ్‌’ శ్రేణిలోని ఈ సరికొత్త రాకెట్లను ‘స్మార్ట్‌ డ్రాగన్‌’, ‘టెంగ్లాంగ్‌’గా పిలుస్తున్నారు. స్మార్ట్‌ డ్రాగన్‌ ఘన ఇంధనంతో, టెంగ్లాంగ్‌ ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి.

ప్రపంచ వాణిజ్య రాకెట్‌ మార్కెట్‌ను ఆకర్షించే విషయంలో భారత్‌ కన్నా వెనుకబడి ఉంది. భారత్‌ పైచేయి సాధించడానికి ప్రధాన కారణం తక్కువ ధరతో ప్రయోగాలు చేపట్టడమే. అందుకే భారత్ మార్కెట్ ను అందుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది.

చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమ నౌకలు పంపుతోంది. అంగారకుడి వద్దకు ప్రయోగాలకు సన్నాహాలు చేస్తోంది. 2022 నాటికి భూకక్ష్యలో శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే టెంగ్లాంగ్‌ ద్రవ రాకెట్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఈ రాకెట్‌ను 2021లోను, స్మార్ట్‌ డ్రాగన్‌ను వచ్చే ఏడాది ప్రయోగించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version