నందమూరి నటసింహం, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డును అందుకోనున్నారు. రెండు నెలల కిందట కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో బాలయ్య బాబుకు పద్మ భూషణ్ అవార్డు వరించింది.
ఈ క్రమంలోనే నేడు ఆయన తన కుటుంబ సభ్యులు, టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రుల సమక్షంలో పద్మ అవార్డును అందుకోనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల సమక్షంలో బాలయ్య చేత కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలాఉండగా బాలకృష్ణ అవార్డు అందుకోనున్న తరుణంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ నేతలు, ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.
నేడు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న నందమూరి బాలకృష్ణ..
కుటుంబ సభ్యుల సమక్షంలో బాలయ్య చేత కేక్ కట్ చేయించిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు pic.twitter.com/6i5LxI8pfJ
— BIG TV Breaking News (@bigtvtelugu) April 28, 2025