బిగ్‌బ్రేకింగ్‌: జూన్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు..!

-

కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది. దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న లాక్‌డౌన్ 4.0కు గ‌డువు ఆదివారంతో ముగుస్తుంది. ఈ క్ర‌మంలో జూన్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను మ‌రో 30 రోజుల పాటు పొడిగిస్తున్న‌ట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇక లాక్‌డౌన్ 5.0లో భాగంగా ప‌లు ఆంక్ష‌ల‌కు కూడా స‌డ‌లింపులు ఇచ్చారు.

దేశంలో మొత్తం 13 న‌గరాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని అధికారులు తెలిపారు. ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మ‌దాబాద్‌, థానె, పూనె, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, హౌరా, ఇండోర్‌, జైపూర్‌, జోధ్‌పూర్‌, చెంగల్‌ప‌ట్టు, తిరువ‌ల్లూర్‌ల‌లో ఆంక్ష‌లు ఉంటాయ‌న్నారు.

  • లాక్‌డౌన్‌ 5.0లో భాగంగా రాత్రి కర్ఫ్యూ 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. గతంలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిగంటలు ఉండేవి. ఇక రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకూడదు.
  • ఆధ్యాత్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ను జూన్‌ 8వ తేదీ నుంచి ఓపెన్‌ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు.
  • అంతర్‌ రాష్ట్ర, రాష్ట్ర అంతర్గత ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించారు.

కాగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 15 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version