Womens Asia Cup Final : టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్

-

మహిళల ఆసియా కప్ లో భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. టీమిండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ లో విజయం సాధించి మహిళల ఆసియా కప్ టీ 20 క్రికెట్ టోర్నమెంట్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగించి రికార్డు స్థాయిలో 8వ టైటిల్ ను గెలుచుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో భారత్ అధ్బుతమైన ప్రదర్శన చేసింది.

భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్, బౌలర్లు ఇప్పటి వరకు జరిగిన అన్నీ మ్యాచ్ ల్లో రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఓపెనింగ్ బ్యాటర్లు  స్మృతి మందన్న షెఫాలీ వర్మ అద్భుతమైన ఆరంబాన్ని ఇచ్చారు. ఈ మ్యాచ్ లో కూడా అద్భుతంగా ఆడి టీమిండియాకి ఫైనల్ కప్ అందిస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news