Indian 2 : కమల్‌హాసన్ టీం నుంచి ఇండియన్‌ 2 ఫైనల్‌ అప్‌డేట్….

-

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2. తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చాలా కాలంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా చిత్ర బృందం ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ తో కమలహాసన్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ లోని కమలహాసన్ ఇంట్రడక్షన్ అమాంతం సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. ఈ వీడియోని చూస్తే భారతీయుడు సినిమాని మించి ఇండియన్ 2 ఉండబోతుందని అర్థమవుతుంది.

ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, స‌ముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news