ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని రవాణా, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మోహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటుచేసిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ సెంటర్ను మంత్రి సందర్శించారు.ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా కంటోన్మెంట్‌తో పాటు 650 కేంద్రాలను ఏర్పాటు చేసి 9.92 లక్షల అప్లికేషన్స్ స్వీకరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారని స్పష్టం చేశారు. ప్రజలు అధికంగా వచ్చినప్పటికీ వారికి ఇబ్బంది కలగకుండా తగిన కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క అభ్యర్థి ప్రజా పాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. అర్హులైన నిరుపేదలకు ఆరు గ్యారంటీలు తప్పకుండా అందుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్,జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రే, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ కమిషనర్,ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు.