చైనాలోని గ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో భాగంగా భారత్ నుండి పార్టిసిపేట్ చేసిన అథ్లెట్లు అందరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం గ్రీకో రోమన్ రెజ్లింగ్ లో 87 కిలోల బరువుకు సంబంధించిన పోటీలో భారత్ కు చెందిన సునీల్ కుమార్ కాంస్య పథకాన్ని సాధించారు. ఇక చరిత్ర ఒకసారి చూస్తే ఈ గ్రీకో రోమన్ విభాగంలో 2010 లో జరిగినా ఆసియ క్రీడల తర్వాత భారత్ కు ఈ పథకం రావడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అందుకే సునీల్ కుమార్ ను భారతీయలు అంతా తెగ పొగిడేస్తున్నారు. కాగా పురుషుల 5000 మీటర్ల రేస్ లో ఫైనల్ లో నయాబ్ సుబేదార్ అవినాష్ సెబుల్ కు రజతం మరియు మహిళల 800 మీటర్ల రేస్ లో హర్మిలన్ బెయిన్స్ కు రజత పతకం వచ్చింది.
ఇలా భారత్ కు చెందిన చాలా మంది అథ్లెట్లు ఆశించిన విధంగానే ఆసియా క్రీడలలో రాణిస్తున్నారు. ఇక ముందు ముందు మరిన్ని పతకాలు భారత్ కు రావాలని ఆశిద్దాం.