ఇటీవల ముగిసిన చెస్ వరల్డ్ కప్ లో ఇండియాకు చెందిన గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన మాగ్నస్ కారల్ సన్ ను గడగడలాడించాడు. విశ్వనాథన్ ఆనంద్ లాంటి ఛాంపియన్ ను ఓడించిన మాగ్నస్ కారల్ సన్ ను సైతం తన ఎత్తులు పై ఎత్తులతో అల్లాడించాడు.. కానీ చివరికి కారల్ సన్ సీనియారిటీ ముందు ప్రజ్ఞానంద్ నిలవలేక ఓటమిపాలయ్యాడు. కానీ ఈ టోర్నమెంట్ లో తన ప్రతిభ వలన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ ను అందుకున్నాడు. ప్రజ్ఞానంద్ 2727 .2 పాయింట్ లను అందుకుని రేటింగ్స్ లో టాప్ 20 ర్యాంక్ లో నిలవడం గమనార్హం. ఇక ఇతనితో పాటు మరో ఇద్దరు భారతీయులు కూడా టాప్ 20 లో నిలిచారు. ఇండియాకు చెందిన యువ గ్రాండ్ మాస్టర్ గుఖేష్ 8వ స్థానంలో మరియు విశ్వనాథన్ ఆనంద్ 9వ స్థానంలో నిలిచారు.
ఇక చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన మాగ్నస్ కారల్ సన్ 2838 .8 పాయింట్ లతో మొదటి స్థానంలో ఉన్నాడు.