భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్‌ : IMA వార్నింగ్‌

-

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో… ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్‌ కారణంగా భారత్ లో భారీ ఎత్తున్న థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుందని…. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగే అవకాశం ఉంద‌ని పేర్కొంది. ఇలాంటి త‌రుణంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కూడా క‌రోనా వ్యాక్సిన్‌ వేయాలని అభిప్రాయ ప‌డింది.

వ్యాక్సిన్ తో కరోనా ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చని పేర్కొంది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌. ఒమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో… ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని పేర్కొంది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌. కాగా… ఇండియాలో ఇప్ప‌టికే ఒమిక్రాన్ వేరియంట్ ఎంట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇండియా లో ఇప్ప‌టి వ‌ర‌కు 23 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ఇంకా ఈ కేసులు బ‌య‌ట ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని.. వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఐఎంఏ హెచ్చ‌రిక‌లు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version