టీమిండియా కు స్టార్ ఆల్ రౌండర్ అని పేరు తెచ్చుకున్న హార్ధిక్ పాండ్య ప్రస్తుతం ఫామ్ కోల్పొయి.. జట్టు కు దూరం గా ఉంటున్నాడు. అతని ఫామ్ వల్ల సెలక్టర్లు కూడా హార్ధిక్ పట్టించు కోవడం లేదు. టీ ట్వంటి ప్రపంచ కప్ తర్వాత హార్ధిక్ పాండ్య ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో హార్ధిక్ పాండ్య షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. టెస్ట్ క్రికెట్ కు హార్ధిక్ పాండ్య రిటైర్మెంట్ ప్రకటించి.. వైట్ బాల్ క్రికెట్ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడని బీసీసీఐ కి చెందిన ఒక అధికారి తెలిపాడు. కాగ హార్ధిక్ పాండ్య ప్రస్తుతం ఎన్ సీ ఏ లో రీహాబిటేషన్ అనే పేరు తో ఉంటున్నాడు.
తిరిగి తన ఫామ్ ను తెచ్చు కోవడానికి తీవ్రం గా శ్రమిస్తున్నాడు. కాగ హార్దిక్ పాండ్య కు 2020 ఐపీఎల్ సిజన్ కు ముందు వెన్నముక ఆపరేషన్ అయింది. ఈ ఆపరేషన్ తర్వాత నుంచి హార్ధిక్ పాండ్య బ్యాటు తో గానీ, బంతి తో గానీ రాణించడం లేదు. ఇప్పటి కే 2020 ఐపీఎల్ లో 2021 ఐపీఎల్ లో ఒక ఓవర్ కూడా బౌలింగ్ చేయలేడు. అలాగే టీ ట్వంటి ప్రపంచ కప్ లో కూడా హార్ధిక్ బౌలింగ్ చేయలేడు. అంతే కాకుండా.. బ్యాటింగ్ లో నూ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి.. వన్డే, టీ 20 లపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడని తెలుస్తుంది.