వ్యాక్సిన్ తీసుకోకుంటే కరెంట్ కట్…

-

ఓమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో అధికారికంగా 23 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరోసారి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పై నజర్ పెట్టాయి. వ్యాక్సిన్లు తీసుకోని వారికి హెచ్చిరికలు కూడా పంపిస్తున్నారు. తాజాగా కొన్నిచోట్ల వ్యాక్సిన్ తీసుకోకుంటే.. రేషన్ సరకులను ఇవ్వడం లేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సిన్ తీసుకోనివారికి వ్యాక్సిన్ ఇవ్వమని కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సంస్థలు వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వమని తేల్చి చెప్పాయి.

తాజాగా సంగారెడ్డి జిల్లాలో వ్యాక్సిన్ తీసుకోని వారికి కరెంట్ కట్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నాయి. దీనికి తోడు టీకాను తీసుకోనివారికి రేషన్ కూడా బంద్ చేశారు. ప్రజలు టీకా తీసుకునేందుకు సమ్మతించిన వారి ఇళ్లకు తిరిగి విద్యుత్  సరఫరాను పునరుద్దరిస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version