జూన్ నెలలో ఆస్ట్రేలియాతో ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను ఆడి దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో జట్టు యాజమాన్యం చేసిన తప్పిదాల వల్లనే ఇండియా ఓడిపోయిందని చాలా మంది విమర్శించిన మాట వాస్తవమే. ఎందుకంటే ఆయా రోజు జట్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకోలేదు. అశ్విన్ కు ఎటువంటి పిచ్ ల మీద అయిన బంతిని టర్న్ చేసి కొమ్ములు తిరిగిన వారిని సైతం అవుట్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. కానీ ఎందుకో అతి ఆత్మవిశ్వాసంతో అతన్ని బెంచ్ కె పరిమితం చేసింది. ఇక ఆ మ్యాచ్ లో ఇండియా చేతులెత్తేసి ఓటమిని మూట గట్టుకుంది. తాజాగా వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో చోటు దక్కించుకున్న అశ్విన్ మొదటి రోజునే వెస్ట్ ఇండీస్ కు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో అశ్విన్ ఫైఫర్ (5/60) ను సాధించి ఇండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా ఈ మ్యాచ్ లో అశ్విన్ అన్ని ఫార్మాట్ లలో కలిపి 700 వికెట్లను తీసుకుని అరుదైన ఘనతను సాధించాడు.
ఇంకా తండ్రి కొడుకులు (శివనారాయణ్ చందర్ పాల్ మరియు టాగ్ నరైన్ చందర్ పాల్) ఇద్దరినీ అవుట్ చేసిన ఇండియన్ గా గుర్తింపును సాధించాడు. కాగా ఇతని ప్రదర్శన చూసిన ఇండియా యాజమాన్యం అయ్యో.. అశ్విన్ ను ఎందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడించలేదు అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది.