దేశంలో మీడియా ఎటువైపు వెళుతుంది

-

ప్రైవేటు టీవీ ఛానళ్ళు గత కొంత కాలంగా దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అంశంపై చర్చోపచర్చలు కొనసాగిస్తూ వస్తున్నాయి. ఆ విషయం పూర్తిగా తెలుసుకోగాలిగాయో లేదో తెలియదు కానీ, స్వేచ్ఛకు కూడా పరిమితులుంటాయని వారికి తెలిసివచ్చింది.

 

పొద్దున్న లేచింది లగాయతు, టీవీ చర్చల్లో మేధావి వర్గం ప్రభుత్వ అస్తిత్వం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దశలో  ప్రభుత్వం- మీడియా జర్నలిస్టులను  అదుపు పేరిట అరెస్ట్ చేయడం ఇప్పుడు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘అతి దారుణమైన, హేయమైన నీతి బాహ్య చర్య’ అని జర్నలిస్టు సంఘాలు ఖండించడం పై  ప్రజా స్పందన కొరవడడానికి కారణం అంతకు ముందు జరిగిన విధ్వంస కాండలకు  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని చానళ్ళ ప్రమేయం ఉండడమే.

మీడియా స్వేచ్చ పై ఒక పక్క బుల్లి తెర పై చర్చలు సాగుతుండగానే, ఈ అరెస్టులు జరిగిపోయాయి.మరి కొన్ని చానళ్ళ వారిపై పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. విధ్వంస ఘటనలకు సంబంధించిన కూడా వందకు పైగా కేసులు నమోదు చేశారు. దేశంలో శాంతి భద్రతల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గగ్గోలు పెడుతున్న వాళ్లకు ఇది మింగుడుపడని వ్యవహారంగా మారింది. దీనికి తోడు తెలుగు చానళ్ళ మధ్య- ఆ మాటకు వస్తే – వాటి యాజమాన్యాల నడుమ కొంత కాలంగా పరోక్షంగా సాగుతున్న ‘యుద్ధాలు’ ఇప్పుడు ‘టెలివిజన్ తెరల పైకెక్కి’ నేరుగా డ్రాయింగ్ రూముల్లోకి చేరాయి.

 

జర్నలిస్టులు రెండు వర్గాలుగా చీలిపోయి ప్రకటనలు గుప్పిస్తుండడంతో- అసలు విషయం నీరుకారి పోయే అవకాశం ఏర్పడింది.ఇన్నాళ్ళూ నివురుగప్పిన నిప్పులా ఉండిపోయిన జర్నలిస్టుల ‘అనైక్యత’ ఇప్పుడు బజారున పడింది. స్వేచ్ఛ గురించి బలంగా గొంతు విప్పగల శక్తి బలహీనపడింది. ఈ పరిణామాలు ఏమాత్రం అభిలషనీయం కావని చెప్పడానికి సంకోచించనక్కరలేదు కానీ భవిష్యత్తు గురించే బాధ్యతకలిగిన జర్నలిస్టులు అలోచించాల్సిన తరుణం ఆసన్నమయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version