అమెరికాలో ఆనలుగురు లో ఒకడు భారతీయుడే…!!!

-

భారతీయులు ఎక్కడ ఉన్నా సరే సంచలనాలకి కేంద్రబిందువులు అవుతారని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచంలో ఏ ఒక్క దేశాన్ని పలకరించినాసరే అక్కడ ఏదో ఒక చోట ఇండియన్స్ జాడ ఉంటూనే ఉంటుంది,. ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యంలో అయితే ఇండియన్స్ ఉనికి ఎక్కువగా ఉంటుంది. తాజాగా అమెరికాలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే.

అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాసీయులలో ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు ఉన్నారని తెలిపింది. అంటే అమెరికాకి వలస వస్తున్న విదేశీ ప్రవాసీయులలో అధిక శాతం మంది భారత్ నుంచీ వస్తున్నారని తెలిపారు. సుమారు 5 లక్షల మంది భారతీయులు రెసిడెంట్ నాన్ ఇమ్మిగ్రేషన్ గా ఉన్నట్లు  2016 లెక్కల ప్రకారం తెలుస్తోందని ఈ నివేదిక తెలిపింది.

దాదాపు 4 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులు కాగా మిగిలిన లక్ష మంది స్టూడెంట్ వీసా పై వచ్చిన వారే. భారత్ తరువాత స్థానంలో చైనా వాసులు అధిక సంఖ్యలో ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. ఆ తదుపరి స్థానాలలో మెక్సికో , కెనడా మొదలు దేశాలు ఉన్నాయి. అంతేకాదు అన్ని రంగాలలో భారతీయులు అమెరికన్స్ కంటే కూడా ముందు ఉన్నారనే విషయాన్ని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news