“భారత వైద్యుడి”…కేసులో బ్రిటన్ కోర్టు సంచలన తీర్పు…!!!

ఏ దేశమేగినా ఎందు కాలిడినా భారతీయుడి ఉనికి ప్రతీ దేశంలో ఉంటుంది. భారతీయుడు లేని దేశం లేలే లేదు అంటే అతిశయోక్తి కాదు. వివిధ దేశాలలో వివిధ రంగాలలో భారతీయులు మనదైన శైలిలో ప్రతిభని చూపిస్తూ భారతీయయులకి ఉన్న అపారమైన తెలివితేటలని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. అందుకే ప్రతీ దేశంలో భారతీయులంటే ప్రత్యేకమైన గౌరవం చూపిస్తారు. అయితే కొందరు భారతీయులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ భారత పరువు తీస్తున్నారు..బ్రిటన్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది..

బ్రిటన్ లో స్థిరపడిన భారత సంతతి వైద్యుడు మనీష్ షా. మావ్నీ మెడికల్ సెంటర్ లో పనిచేస్తున్నాడు.అతడి వయసు 50 ఏళ్ళు. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళా రోగులు తనవద్దకి వచ్చినపుడు అతడు చేసే వెకిలి చేష్టలతో విసిగి వేసారిపోయారు కొందరు మహిళలు. అవసరం లేకపోయినా సరే వారిని స్కానింగ్ చేయించుకోవాలని చెప్పడం, ఈ వొంకతో వారి ప్రవైటు పార్ట్స్ పై తాకడం చేశాడు.

 

ఇలా మొత్తం 23 మంది మహిళలతో అసభ్య ప్రవర్తన చేసిన అతడు చివరికి 15 ఏళ్ళ మైనర్ ని కూడా వదల్లేదు. ఇతడి ప్రవర్తన పై విసిగిపోయిన ఓ మహిళ అతడిపై ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంక కదిలినట్టుగా మరో 20 మందిని సైతం అతడు ఇలానే లైఘికంగా వేధించాడని తెలిసింది. దాంతో అతడిని 2018 లోనే అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరుచాగా తాజాగా కోర్టు అతడికి యావజ్జీవ శిక్షని మూడు సార్లు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.