ఐపీఎల్ లో భారత పేసర్లకు భారీ డిమాండ్

-

సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లు అంటేనే ప్రేక్షకులకు మస్తు మజా అనే చెప్పాలి. ఇక అందులో బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐపీఎల్ వికెట్లు తీసే బౌలర్లకు క్రేజీ మామూలుగా ఉండదు. అందులో మన భారత బౌలర్లకు ప్రస్తుతం భలే డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రెండో రోజు కూడా టీమిండియా పేసర్లకు డిమాండ్ కొనసాగింది. వీరిని కొనేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి దాదాపు పదేళ్ల నుంచి అంటిపెట్టుకొని ఉన్న భువనేశ్వర్ రూ.10.75 కోట్లు, దీపక్ చాహర్ రూ.9.25 కోట్లు, ఆకాశ్ దీప్ రూ.8 కోట్లు, ముఖేష్ కుమార్ రూ.8కోట్లు, తుషార్ దేశ్ పాండే రూ.6.50 కోట్లు పలికారు. స్వదేశీ పిచ్ లపై వీరు మెరుగ్గా రాణిస్తారని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అప్గాన్ యువ సంచలనం అల్లా ఘజన్ ఫర్ భారీ ధర పలికారు. బేస్ ప్రైజ్ రూ.75 లక్షలతో మొదలైన అతన్ని ముంబై రూ.4.80 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version