Breaking : రూపాయి పతనం.. కనిష్టానికి పడిపోయిన మారకం విలువ..

-

గత కొంత కాలంగా క్షీణిస్తోన్న రూపాయి విలువు నేడు ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి పతనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. వరుస రికార్డు పతనానికి చేరుతున్న రూపాయి గురువారం వరుసగా నాల్గవ సెషన్‌లో ఆల్‌ టైం కనిష్టాన్ని టచ్‌ చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా రూ.80కి చేరుకుంది. 79.90 వద్ద కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం కనిష్ట స్థాయి 79.66ను తాకి, చివరికి రికార్డు కనిష్ట స్థాయి 79.62 వద్ద ముగిసింది. అంతేకాదు సమీప కాలంలో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 82 కి పడిపోవచ్చని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత ఆరు నెలల్లో రూపాయి విలువ 27 సార్లు పతనమైంది. ముందు నుంచీ ఈ విలువ రూ.80కి పడిపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ ఇవాళ రూపాయి మారకం విలువ రూ.79.72 పైసల వద్ద ప్రారంభమై రూ.79.92కు పడిపోయింది. ఫైనల్ గా ఆ విలువ రూ.79.90 పైసల వద్ద ముగిసింది. మొన్నటివరకూ రూ.74కు కాస్త అటూ ఇటుగా దోబూచులాడిన రూపాయి మారక విలువ.. ప్రస్తుతం రూ.80కి చేరువకు వచ్చింది. అంటే సుమారు 9శాతం పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version