ఇండియా కూటమివి వంశ పారంపర్య రాజకీయాలు : అమిత్ షా

-

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకుందని ఆరోపించారు. అమేథీలో స్మృతి ఇరానీ, రాయబరేలీలో దినేష్ ప్రతాప్ సింగ్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన, వారిద్దరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారని, రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ విజయాన్ని నమోదు చేస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. వారు వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నారు. లాలూజీ తన కొడుకును సీఎం చేయాలని, మమత తన మేనల్లుడిని సీఎం చేయాలని, సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రజలు వారికి ఎలాంటి సీటు ఇవ్వకూడదని నిర్ణయించారు. రాయబరేలీ, అమేథీ స్థానాలు కాంగ్రెస్ కి చెందుతాయని వారు భావిస్తున్నాను. వారికి ఎలాంటి సీటు కేటాయించాలో ప్రజలే నిర్ణయిస్తారని అమిత్ అన్నారు. ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. కానీ మోడీ మాత్రం దాన్ని రద్దు చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టారు. ఉగ్రవాదులను తుడిచిపెట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనదే. భయపడలేదు అని  అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news