ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా

-

తెలంగాణలోని మహిళా రాజకీయ నాయకుల్లోని మంచి వక్తల్లో ఇందిరా శోభన్ ఒకరు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మంచి మైలేజ్ సంపాదించుకున్న ఇందిరా శోభన్ వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించగానే ఊహించని విధంగా అందులో చేరారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ప్రధాన అనుచరురాలిగా వ్యవహరించారు.

ఆ తర్వాత ఆ పార్టీలో పెద్ద నేతలు ఎవరు లేకపోగా, కనీసం కాంగ్రెస్లో దక్కిన గౌరవం కూడా దక్కట్లేదని ఆ పార్టీకి రాజీనామా చేసి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. కెసిఆర్ తో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవినీతిపరుడైన కెసిఆర్ తో కలిసి నడవాలని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు దిద్దినట్టుగా ఉందని ఆరోపిస్తూ పార్టీ నుంచి వైదొలిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version