ఎకరం లోపు భూమి ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి : హరీశ్ రావు

-

ఎకరం లోపు భూమి ఉన్న వారిని కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి.. వ్యవసాయ కూలీలకు ఇచ్చే రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదాహరణకు 1 గుంట భూమి ఉన్న వారికి రూ.250 రైతు భరోసా కింద వస్తే.. భూమి లేని వారికి రూ.12వేలు వస్తున్నాయి. 1 గుంట భూమి ఉండటం వల్ల ఆ కూలి నష్టపోతున్నాడని తెలిపారు. అలాగే ఉదాహరణకు అర ఎకరం భూమి ఉన్న వారు రూ.6వేలు నష్టపోతారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

రైతును మోసం చేశావు.. కౌలు రైతును మోసం చేశావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది. ఊర్లళ్లకు వస్తే.. కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తోంది. రైతులకు మేలు అయింది. వ్యవసాయ కూలీలకు మేలు అవుతలేదని తెలిపారు. రైతులను ముంచింది కాక సీఎం రేవంత్ రెడ్డి సంబురాలు చేయమంటున్నారు. 50లక్షల ఉపాధి హామీ కార్డులున్నారు. 1కోటి 2లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు వెల్తుంటే.. 10లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తిండికి లేనోడే ఉపాధి హామీ పనికి వెళ్తాడని తెలిపారు. ఎన్నికలప్పుడు మాటలు కోటలు దాటాయి. కౌలు రైతులు సీఎం రేవంత్ రెడ్డికి గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version