వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలే నా లక్ష్యం అంటున్నారు భారత సంతతి మహిళ తులసీ గబ్బార్డ్. అందుకు తాను ఎంతో శ్రమిస్తున్నట్టుగా తెలిపారు. డెమోక్రటిక్ పార్టీ నుంచీ అమెరికా అధ్యక్ష పీటం కోసం బరిలో నిలుచున్న 18 మందిలో తులసి గబ్బార్డ్ ఒకరు. ఇదిలాఉంటే రిపబ్లికన్ పార్టీ నుంచీ కేవలం ట్రంప్ ఒక్కడే బరిలో ఉండటం ఇక్కడ మరొక విశేషం. అయితే తుది పోరులో ట్రంప్ తో కలిసి ఎవరు పోటీలో నిలబడతారు అనేది సర్వాత్ర ఆసక్తి నెలకొంది.
తాజగా తులసీ గబ్బార్డ్ న్యూ హ్యాంషైర్ డెమోక్రటిక్ పార్టీ స్టేట్ కన్వెన్షన్ లో మాట్లాడుతూ ట్రంప్ పాలనకి కాలం చెల్లిందని తెలిపారు. ఇకపై ట్రంప్ ఇంటికి మాత్రమే పరిమితం అవుతారని విమర్శించారు. తానూ కేవలం అధ్యక్ష పదవి రేసులోనే ఉన్నానని మళ్ళీ అమెరికా కాంగ్రెస్ కి ఎన్నిక కావాలని అనుకోవడం లేదని తెలిపారు. అమెరికా ప్రజలకి సేవచేయడానికి మాత్రమే తాను పోటీలో ఉన్నట్టుగా తెలిపారు.
తులసీ చేసిన ఎంతో భవొద్వేగ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. మీ అందరికోసమే నేను బరిలో నిలుచున్నాను. నాకు మద్దతు ఇవ్వండి అంటూ ఆమె కోరడంతో సభ మొత్తం హర్షద్వానాలతో నిండిపోయింది. గబ్బార్డ్ ఆర్మీలో ప్రస్తుతం మేజర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు ప్రతినిధుల సభలో దాదాపు ఏడేళ్ళ పాటు పనిచేసిన ఆమె ట్రంప్ కి గట్టి పోటీని ఇచ్చే వారిలో ఒకరిగా ఉండటం విశేషం.