గత కొంతకాలంలో దేశంలో రైలు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.అధికంగా ఉత్తర, మధ్య భారతంలో రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. అందుకు కారణం ఏమిటని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. కొందరు ప్రకృతి వైపరీత్యం అంటుంటే మరికొందరు మానవ తప్పిదం అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ప్రమాదాలు జరిగాయి.కానీ, ఇటీవల నెలలో రెండు లేదా మూడు ప్రమాదాలు జరగడంతో రైళ్లలో ప్రయాణించేందుకు సామాన్యులు జంకుతున్నారు. తాజాగా మద్యప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఇండోర్ -బజల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఫ్లాట్ ఫాంపైకి వెళ్తుండగా రెండు కోచులు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు.ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు పేర్కొన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. రైలు ఇండోర్ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు.